రంగేస్తున్నారా...

01-08-2017: స్టయిల్‌ కోసమని కొందరు, తెల్లజుట్టు కనబడకుండా మరికొందరు - ఇలా దాదాపుగా అందరూ జుట్టుకు రంగు వేయడం అనేది పెరిగిపోయింది. అంతా బాగానే ఉంది గానీ వీటివల్ల క్యుటికిల్‌ డ్యామేజ్‌ అవుతుంది. జుట్టు చిట్లిపోతుంది. చిక్కులు పడుతుంది. మెరుపు కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది.

మరి దెబ్బతిన్న క్యుటికిల్‌ను బాగు చేయడం ఎలా? సింపుల్‌ పద్ధతి ఒకటి ఉంది. అదేంటంటే క్రమం తప్పకుండా నూనెతో తలకు మర్దన చేయాలి. దీన్నే డీప్‌ కండిషనింగ్‌ ట్రీట్‌మెంట్‌ అనొచ్చు. దీన్ని బ్యూటీపార్లర్‌లలో కూడా చేస్తారు.

తలకు నూనె పెట్టకుండా తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు పొడిబారుతుంది. రంగు కూడా త్వరగా పోతుంది. అందుకని జుట్టుకు రంగు వేసుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.