మూలకణ చికిత్సతో జుట్టు పెరుగుదల!

లాస్‌ఏంజెలిస్‌, ఆగస్టు 15: బట్టతలను నివారించడానికి ఇప్పటి దాకా ఉపశమనచర్యలు మాత్రమే ఉన్నా యి. కానీ, తాజాగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా పరిశోధకులు తలపై ఉన్న మూలకణాలను ఉత్తేజపరిచి జట్టు పెరుగుదలకు దోహదం చేసే సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. జుట్టులో జీవాణువులు చాలా కాలం బతికే ఉంటాయని, వాటిని ప్రేరేపిస్తే జట్టు పెరుగడానికి అవకాశం ఉందని తెలిపారు.