ఒత్తైన జుట్టు కోసం...

09-08-2019: కురులు ఒత్తుగా పెరగాలంటే జుట్టుకు ఓవర్‌నైట్‌ ప్యాక్‌ వేయాలి. ఎలాగంటే....

ఒక బౌల్‌లో ఒక టేబుల్‌స్పూను కలబంద గుజ్జు, ఒక టేబుల్‌స్పూను కొబ్బరినూనె, ఒక టేబుల్‌స్పూను ఆలివ్‌ నూనె, అంతే పరిమాణంలో బాదం నూనె, ఒక విటమిన్‌ ఇ క్యాప్స్యూల్‌ తీసుకుని అన్నిటినీ బాగా కలుపుకోవాలి.
వెంట్రుకలను విడదీసి కుదుళ్లకు ఈ మిశ్రమాన్ని పట్టించాలి.
మునివేళ్లతో గోళ్లు తగలకుండా, వృత్తాకారంలో కుదుళ్లకు మర్దన చేయాలి.
తర్వాత తలకు తువ్వాలు చుట్టుకుని పడుకుని ఉదయం తలస్నానం చేయాలి.
ఇలా వారానికోసారి రెండు నెలల పాటు చేస్తే, కుదుళ్లు బలపడి వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి