తలస్నానం ఇలా వద్దు!

22-08-2017: తలస్నానం చేసేటప్పుడు చాలామంది ఆడవాళ్లు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవేమిటంటే..

తలస్నానానికి వేడినీళ్ల ఎక్కువగా వాడుతుంటారు. ఇది సరికాదు. ఎందుకంటే వేన్నీళ్లతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు వేగంగా డ్రై అవుతాయి. వేడి నీళ్లకు బదులు గోరువెచ్చటి నీళ్లతో చేస్తే మంచిది. దీని వల్ల షాంపు, కండిషనర్లు కూడా వెంట్రుకలపై బాగా పనిచేస్తాయి.

షాంపుతో తలస్నానం చేసేముందు వెంట్రుకలను నీళ్లతో బాగా కడుక్కోవాలి. షాంపును తలకు రాసుకోబోయే ముందు కనీసం ఒకటి రెండు నిమిషాల పాటు జట్టును షవర్‌ కింద ఉంచాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బాగా తడుస్తాయి. దీంతో షాంపు, కండిషనర్లు జుట్టుపై బాగా పనిచేస్తాయి.

తలస్నానం వేగంగా చేసేయొద్దు. షాంపు, కండిషనర్లు శుభ్రంగా పోయేదాకా చేయాలి.

చాలామంది తలకు షాంపును ఎక్కువ రాసుకుంటారు. ఇది ఇంకో తప్పు. ఎక్కువ షాంపు వెంట్రుకలపై అప్లై చేస్తేనేగాని వెంట్రుకలపై షాంపు సరిగా పనిచేయదనే దురభిప్రాయం చాలామందిలో ఉంది. కాని ఇది కరెక్ట్‌ కాదు.. ఎక్కువ షాంపు తలపై రాయడం వల్ల నురగ బాగా వస్తుంది తప్ప ప్రయోజనం ఉండదు.