అవిసె మాస్కుతో అందమైన జుట్టు...

08-12-2018: అవిసె గింజలు శరీరానికి ఎంతో ఎనర్జీని ఇస్తాయి. పీచు, మాంసకృతులు, విటమిన్లు, పలురకాలైన ఖనిజాలు వీటిల్లో సమృద్ధిగా ఉన్నాయి. లావు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకూ వీటి వల్ల పొందే ఆరోగ్య లాభాలెన్నో. 
ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాలు వీటిల్లో పుష్కలంగా ఉన్నాయి.
పీచు, మాంసకృతులు, విటమిన్లు బాగా ఉన్నాయి.
వీటిని రోజూ తీసుకోవడం వల్ల రొమ్ముక్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
వీటిలోని యాంటి-ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల మోకాళ్లు, కీళ్ల నొప్పులు రావు.
జీర్ణ సబంధిత వ్యాధుల పాలబడకుండా కాపాడతాయి.
మెనోపాజ్‌ దశలోని మహిళలకు అవిసెగింజల్లోని లింగ్‌నాన్స్‌ ఎంతో మేలు చేస్తాయి. కారణం వీటిల్లో ఇస్ట్రోజన్‌ గుణాలు బాగా ఉన్నాయి.
హార్మోన్ల సమతుల్యతకు అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి.
ఎముకలను దృఢంగా ఉంచుతాయి.
ఆడవాళ్లల్లో రుతుక్రమం సవ్యంగా జరిగేలా సహాయపడతాయి.
రోజూ వీటిని తినడం వల్ల చర్మం, జుట్టు, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
అవిసె మాస్కును జుట్టుకు రాసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి.
అవిసె గింజలు చర్మం పొడిబారడాన్ని తగ్గించడమే కాకుండా స్కిన్‌ని మృదువుగా ఉంచుతాయి.
కొవ్వు, పీచుపదార్థాల వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
ఇవి శరీర జీవక్రియను మెరుగుపరుస్తాయి.
బరువు తగ్గించడంలో సహాయపడతాయి.
కొలెస్ట్రాల్‌, రక్తపోటు, మధుమేహాలను ఇవి అదుపులో ఉంచుతాయి.
అవిసెగింజల్లో శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణాలు బాగా ఉన్నాయి.
నిత్యం ఉదయం కొన్ని అవిసెగింజలు తింటే అల్సర్‌ సమస్య తగ్గుతుంది.