నిత్య వ్యాయామంతో సుఖ ప్రసవం

21-07-2017: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, కొద్దిపాటి వ్యాయామంతో గర్భిణీలు సిజేరియన్‌ ఆపరేషన్‌ తప్పించుకోవచ్చని తాజా పరిశోధనలో వెల్లడైంది. దీంతోపాటు గర్భంతో ఉన్నపుడు ఎదురయ్యే ఇతర సమస్యలు.. బరువు పెరగడం, మధుమేహం వంటి వాటికి కూడా చెక్‌ పెట్టవచ్చని క్వీన్‌ మేరీ యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ పరిశోధక బృందం పేర్కొంది. ఈ బృందంలో భారత సంతతికి చెందిన షకీలా తంగరత్నం కూడా ఉండడం విశేషం! సిజేరియన్‌ వల్ల తల్లీబిడ్డలకు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రసవం కోసం మంచి ఆహారంతో పాటు నిత్యం తేలికపాటి వ్యాయామం చేయాలని వారు సూచిస్తున్నారు. దీంతో సిజేరియన్‌ చేయాల్సిన అవకాశాలు 10 శాతం తగ్గుతాయని తెలిపారు.