సోయా వల్ల పురుషులకు ముప్పే!

ఆంధ్రజ్యోతి,29-12-2016: పురుషుల వీర్యం ద్వారా స్త్రీలు గర్భం దాల్చుతారేనది జనమెరిగిన సత్యం. ఇప్పటీవరకూ  వీర్య పెంపుదలకు ఏ తినాలో చాలా మంది తెలుసుకునే ఉంటారు. కానీ ఒక ఆహారం పదార్ధం పురుషులను భయభ్రాంతులకు గురి చేస్తోంది ఎందుకంటే ఆ ఆహారం తింటే వీర్యం ఉత్పత్తి పెరుగుదలకు అడ్డుకట్టేనట. అదేంటో కాదు సోయా. ప్రస్తుత కాలంలో మాంసాహారంతో పాటు  సోయాని కూడా ఆహారంలో తీసుకోవడానికి చాలా మంది అలవాట్టు పడ్డారు. ఈ సోయా వాడకం వల్ల పురుషులలో వీర్యం ఉత్పత్తి స్థాయి తక్కువైనట్లు స్పెయిన్‌లోని వాలెన్సియా వర్సిటీ, బ్రిటన్‌లోని ఐవీఐ ఫెర్టిలిటీ కేంద్రం నిపుణులు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో రుజువైంది. దాదాపు రెండేళ్లపాటు 25 మంది పురుషులపై ఈ అధ్యయనం చేశారు. వీళ్లు తీసుకునే ఆహారంలో సోయా స్థాయిలు ఎక్కువగా ఉండేలా చూశారు. సోయా పైపొరల్లో ఉండే బిస్ఫెనాల్‌-ఏ రసాయన ప్రభావాన్ని గుర్తించేందుకు ఈ అధ్యయం చేపట్టగా, ఫైటో ఈస్ట్రోజన్‌గా పిలిచే మరో రసాయన ప్రభావం గురించి ఈ పరిశోధనలో తెలిసింది. ఇది వీర్య కణాల ఉత్పత్తి వేగాన్ని తగ్గిస్తోందని, క్రోమోజోమ్‌ల నిష్పత్తిపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తోందనే విషయం చివరికి వెల్లడైంది. కాబట్టి సోయాకు ఎంతదూరంగా ఉంటే అంత మంచిదని పరిశోధకులు వెల్లడిస్తున్నారట.