మీరు తినే ఫుడ్‌ మీరేంటో చెబుతుంది!

ఆంధ్రజ్యోతి, 14-09-2017:మీరు తినే ఫుడ్‌ను బట్టి మీ స్వభావాన్ని కనిపెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా..!మనం తినే దాన్ని బట్టి మనం ఎలా ఆలోచిస్తామన్నది తెలుస్తుందట. అవేమిటో చూద్దామా...

కొందరు తమకు ఎంతో ఇష్టమైన వాటినే తింటారు. ముఖ్యంగా సెన్సేషన్‌ సీకర్స్‌ ఇలాంటి పని చేస్తుంటారు. వీళ్లు వేడి వేడి ఫుడ్‌ తింటారు. స్పైసీవి తింటారు.. క్రంచెస్‌ తింటారు. వేడి చాక్లెట్లను సైతం లాగిస్తారు. ఇష్టమైన వాటిని అస్సలు వదులుకోరు.
 
మనం తినే ఫుడ్‌ మన మూడ్స్‌ను, జ్ఞాపకాలను కూడా సూచిస్తాయి. ఉదాహరణకు ఒత్తిడిలో ఉండేవాళ్లు స్వీట్లు బాగా తింటారు. ఇలాంటి వారంతా కంఫర్ట్‌ సీకర్స్‌. వీళ్లు మానసిక ప్రశాంతత కోసం అలా చేస్తారు.
 
కొందరు స్పాంటేనియస్‌ ఈటర్స్‌ ఉంటారు. ఫుడ్‌కు ప్లానింగ్‌ ఏంటి అన్నది వీళ్ల ఫిలాసఫీ. అంతేకాదు అలా ప్లానింగ్‌గా వెళ్లి ఫుడ్‌ తినడం అంటే ఇలాంటివాళ్లు చాలా బోరింగ్‌గా ఫీలవుతుంటారు కూడా. ఆ క్షణంలో అనుకోకుండా ఫుడ్‌ను తినాలి. దాన్ని ఎంజాయ్‌ చేయాలి. ఇది ఈ తరహా వ్యక్తుల స్వభావం. అందుకే కొందరు హఠాత్తుగా డిన్నర్‌ ప్లాన్స్‌ చేస్తుంటారు.
 
భోజనప్రియుల దృష్టి ఎప్పుడూ ఏం తినాలన్నదానిమీదే ఉంటుంది. వీరిదొక ఎక్స్‌ట్రీమ్‌ టైపు. ముఖ్యంగా యువత, ఆరోగ్యం పట్ల శ్రద్ధచూపని వాళ్లు ఎక్కువగా కాఫీ, సిగరెట్‌, గ్రీసీ వంటకాలను తింటారు. .
 
కొందరు బతకడానికి తిండి తినాలన్నట్టు ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్లు భోజన వేళలను కచ్చితంగా పాటిస్తారు. భోజనం చేయడానికి వీలు లేకపోతే కనీసం కాఫీ, కుకీస్‌ అయినా సరే తీసుకుంటారు. ఈ రకం వాళ్లు దేన్నీ అతిగా తినరు.