డైటరీ సప్లిమెంట్లతో జర జాగ్రత్త!

25-7-2017: డైటరీ సప్లిమెంట్లు, ఎనర్జీ డ్రింకుల విషయంలో జాగ్రత్త అవసరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటిని వినియోగించి అనారోగ్యం బారిన పడుతున్నారని, అమెరికాలో ఇలా ప్రతీ 24 నిమిషాలకు ఒకరు ఆస్పత్రి పాలవుతున్నారని తెలిపారు. ఈ ఉత్పత్తులను మందుల కేటగిరిలో చేర్చకపోవడం వల్ల ఎఫ్‌డీఏ అనుమతి అవసరం లేదన్నారు. ఈ ఉత్పత్తులపై బయట ఎక్కడా, ఎలాంటి పరీక్షలు జరగడం లేదు.