ఎప్పుడు, ఏం తినాలి?

23-04-2018: ఆకలేసినప్పుడు, వీలు కుదిరినప్పుడు తింటూ ఉంటాం! కానీ అల్పాహారానికైనా, భోజనానికైనా నియమిత సమయాలు పాటించాలి. అప్పుడే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

ఉదయం అల్పాహారం
ఉదయం 7 నుంచి 8 గంటలలోపు తినేయాలి.
ఎటువంటి పరిస్థితుల్లోనూ 10 దాటిన తర్వాత అల్పాహారం తినకూడదు.
నిద్ర లేచిన అరగంటలోపే అల్పాహారం తీసుకోవాలి.

మధ్యాహ్న భోజనం

12.30 నుంచి 2 గంటల్లోపు మద్యాహ్న భోజనం ముగించాలి.
సాయంత్రం 4 తర్వాత తినకూడదు.
ఉదయం అల్పాహారానికి మధ్యాహ్న భోజనానికి మధ్య 4 గంటల విరామం మాత్రమే ఉండాలి.

రాత్రి భోజనం

6 నుంచి 9 గంటల మధ్య ముగించాలి.
రాత్రి 10 దాటిన తర్వాత తినకూడదు.
నిద్రకు మూడు గంటలముందే రాత్రి భోజనం ముగించాలి.