బొప్పాయితో.. బహు లాభాలు

ఆంధ్రజ్యోతి, 19-09-2017: బొప్పాయి పండులో ఎన్నో ఔషధగుణాలున్నాయి. భోజనం చేశాక బొప్పాయి తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మూత్రపిండాలతో రాళ్ళు అరికట్టేందుకు బొప్పాయి ఎంతగానో దోహద పడుతుంది. బొప్పాయి ఆకులతో చేసిన జ్యూస్‌ తాగితేప్లేట్లేట్స్‌ సంఖ్య పెరుగుతుంది. అందుకే డెంగ్యూ సోకిన వారికి ఈ జ్యూస్‌ తాగమని చెబుతారు. బొప్పాయి ఆకులను మెత్తగా దంచి పసుపుతో కలిపి పట్టువేస్తే బోధకాలు తగు తుంది. ఈ ఆకుల్లో యాంటీ మలేరియా గుణాలున్నాయి. వీటిలోని యాక్టోజనీస్‌ విషజ్వరాలు రాకుండా కాపాడుతుంది. జీర్ణక్రియ బాగా జరగడమే కాకుండా మలబద్దకం కూడా తగ్గుతుంది. ఇందులో యాంటి ఇంప్లిమేటరీ గుణాలు ప్లేగు, పొట్టలోని మంటను తగ్గిస్తాయి. మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఈరసం మంచిది శరీరంలోని ఇన్సులిన్‌ ఉత్పత్తిని క్రమబద్దీ కరిస్తుంది. బొప్పాయి ఆకుల్లో విటమిన్‌-సి, విటమిన్‌-ఎలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ జ్యూస్‌ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా, ఎంతో కాంతివంతంగా ఉంటుంది.