వీటిని తీసుకోండి!

22-04-2019: మహిళలకు కొన్ని పోషకాలు అత్యవసరం. వీటి లోపం ఏర్పడితే కీలకమైన జీవక్రియలు అదుపు తప్పుతాయి. కాబట్టి పోషకాలు, వాటి అవసరాల గురించి అవగాహన ఏర్పరుచుకోవాలి.
 
ఐరన్‌: ఐరన్‌ శక్తినిస్తుంది. ఆక్సిజన్‌ శరీరంలో సక్రమంగా ప్రసరించడానికి కూడా ఐరన్‌ అవసరమే! వ్యాధినిరోధకశక్తి, కండరాల పనితీరు మెరుగ్గా ఉండాలన్నా తగుమాత్రం ఐరన్‌ తీసుకోవడం తప్పనిసరి.
 
బి12: మెదడు, నాడీవ్యవస్థ, రక్తకణాల పనితీరుకు బి12 సరిపడా ఉండాలి. శక్తి పెరిగి, భావోద్వేగాలు అదుపులో ఉండాలన్నా బి12 తగు ప్రమాణాల్లో శరీరానికి అందాలి.
 
బయోటిన్‌: చర్మం, వెంట్రుకలు, గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత బయోటిన్‌ అందేలా చూసుకోవాలి. నాడీ, జీర్ణ, గుండె సంబంధ జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా ఈ పోషకం అందాలి.
 
క్యాల్షియం: బలమైన ఎముకల కోసం క్యాల్షియం అవసరం. గుండె, కండరాలు, నాడులు చురుగ్గా పని చేయాలన్నా క్యాల్షియం సరిపడా తీసుకోవాలి.
 
మెగ్నీషియం: నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం దొరకాలన్నా, నెలసరి సమస్యలు తొలగాలన్నా, నీరసం, ఒళ్లు నొప్పులు వదలాలన్నా మెగ్నీషియం సమృద్ధిగా తీసుకోవాలి.
 
విటమిన్‌ డి: ఆహారం ద్వారా అందే క్యాల్షియం శరీరం శోషించుకోవడానికి విటమిన్‌ డి అవసరం.