మేలైన ఆహారంతో ఊబకాయానికి చెక్

ఏమేం తీసుకోవాలో సూచిస్తున్న వైద్యులు

చెడు కొలెస్ట్రాల్‌కు దూరంగా ఉండాలని హితవు
లేకుంటే..ఆరోగ్య సమస్యలేనని హెచ్చరిక

ఆంధ్రజ్యోతి, 19-09-2017: మారుతున్న పరిస్థితులు..ఆహారపు అలవాట్లు.. ఊబ కాయానికి హేతువులు.  రోజూ తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాల శాతం అధికంగా ఉండడంతో ప్రతి ఒక్కరూ ఊబకాయంతో బాధపడాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో..రోజువారీ ఆహారంలో..కొవ్వును తగ్గించే..పలు ఆహార పదార్థాలు తీసుకుంటే.. మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొవ్వును తగ్గించే పదార్థాలు.. వాటి వల్ల ఉపయోగాల గురించి వివరిస్తున్నారు.
 
పసుపు
రోజూ తినే  ఆహారంలో.. వీలైనంత వరకు పసుపును వాడితే గుండెకు మంచిది. పసు పు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి రక్తపో టును నియంత్రిస్తుంది. రక్తకణాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి.. గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
 
యాలికలు
మనం తిన్న ఆహారం సాఫీగా జీర్ణమైతే శరీరానికి తగినంత జీవశక్తి లభిస్తుంది. యాలి కలతో జీర్ణక్రియ మెరుగ వుతుంది. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు ను తొలగించే శక్తి యాలికలకు ఉంది.
 
మిరప 
ఆహారం తీసుకున్నాక.. కేవలం 20 నిమిషాల్లోనే  మిరప తన ప్రభావాన్ని చూపిస్తుంది. మిరపలోని క్యాప్సిస్‌ కేలరీలను వేగంగా ఖర్చుచేస్తుంది. కేలరీలు తొందరగా ఖర్చయ్యే కొద్దీ కొలెస్ట్రాల్‌ పెరగదు.
 
కరివేపాకు
బరువును తగ్గించేందుకు కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకు పోయిన టాక్సిన్లను, చెడు కొవ్వును తొలగిస్తుంది. కరివేపాకు ను కూరలో కలిపి తిన్నా లేదా కరివేపాకు జ్యూస్‌ చేసుకొని తాగినా మంచిదే.
 
ఆలివ్‌ ఆయిల్‌
 ఆలివ్‌ ఆయిల్‌.. సన్‌ఫ్లవర్‌, గ్రౌండ్‌ నట్‌ ఆయిల్‌తో పోల్చుకుంటే ఖరీదెక్కువ. అయినా అన్ని నూనెలు కంటే దీంట్లో కొలెస్ట్రాల్‌ తక్కువ. ఆలివ్‌ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్‌ హృద్రోగులకు ఎంతగానో మేలుచేస్తుంది.
 
క్యాబేజీ
బరువును తగ్గించేందుకు క్యాబేజీ చక్కగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని తినేవారిలో కొలెస్ట్రాల్‌ మోతాదు తక్కువగా ఉంటుంది. ఎక్కువ నూనెతో క్యాబేజీ కూరలు చేయకుండా ఉడికించిన క్యాబేజీని తింటే కొలెస్ట్రాల్‌ పెరగదు.
 
పెసరపప్పు
కాల్షియం, పొటాషియం, ఇనుము పెసరపప్పులో పుష్కలం. వీటితో పాటు విటమిన్‌-ఏ, బీ, సీ, ఈ, ప్రోటీన్లు, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు త క్కువ.  దీనిని తినడం ఎంతో మేలు.
 
తేనె
మధురమైన రుచిని అందించడమే కాకుం డా ఊబకాయాన్ని తగ్గించి తక్కువ సమ యంలో ఎక్కువ శక్తిని ఇస్తుంది. రోజూ ఉదయం పూట వేడినీళ్లలో పదిచుక్కల తేనె కలిపి తాగితే చురుగ్గా ఉంటారు.
 
మజ్జిగ
గ్లాసుడు మజ్జిగలో 2.2 గ్రాముల కొవ్వు, 99 కేలరీలు లభ్యమవుతాయి. అదే పాలల్లో అయితే 8.9 గ్రాముల కొవ్వు, 150 కేలరీలు ఉంటాయి. శరీరంలో తక్కువ కొవ్వును చేర్చి ఎక్కువ శక్తిని ఇచ్చే గుణం మజ్జిగకు ఉంది. వెన్న తీసిన మజ్జిగతో బరువు కూడా తగ్గవచ్చు.
 
సజ్జలు
అత్యధిక ఫైబర్‌ దొరికే ధాన్యాల్లో సజ్జలు ముందువరుసలో ఉంటాయి. రాగి, జొన్న, గోధుమలు ఎక్కువ వాడితే తక్కువ కొలెస్ట్రాల్‌తో పాటు ఎక్కువ ఫైబర్‌ లభిస్తుంది. సజ్జలతో చేసిన రొట్టెలు తింటే తక్కువ కొవ్వుతో కూడిన ఆహారంతో పాటు కొలెస్ట్రాల్‌ దరిచేరదు.
 
లవంగాలు
 వీటికి ఉత్తమ ఔషధ గుణాలు ఉన్నాయి.  డయాబెటిస్‌, మధుమేహం దరిచేరనీయవు.ఇవన్నీ రోజూ మన ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక బరువు, అధిక రక్తపోటు, మధుమేహం, జీర్ణకోశ వ్యాధుల నుంచి తప్పించుకొని చక్కటి ఆరోగ్యంతో హాయిగా జీవించవచ్చు.