పనీర్‌ పోషకాల నిధి

21-06-2019:పనీర్‌ను చిన్నా, పెద్దా అందరూ ఇష్టపడతారు. రకరకాల డెజెర్ట్స్‌, ఫుడ్‌ ప్రిపరేషన్లలో దీన్ని వాడతారు. ఇది ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్‌. దీనివల్ల పొందే ఆరోగ్య ఫలితాలు ఎన్నో. అవి....

పనీరులో ప్రొటీన్లు బాగా ఎక్కువ.

దీన్ని తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.
బ్లడ్‌షుగర్‌ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తుంది.
గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది.
పనీర్‌లో ఫోలేట్‌ పుష్కలం. ఫోలేట్‌ బికాంప్లెక్‌ విటమిన్‌. ఇది గర్భిణీలకు ఎంతో ముఖ్యం. గర్భంలోని పిండాభివృద్ధికి ఇది సహకరిస్తుంది.
పనీర్‌లోని ఫొలేట్‌ ఎర్రరక్తకణాలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది.
పనీర్‌ వల్ల బరువు తగ్గుతాం. దీనిలోని పోషకాల వల్ల ఆకలి తొందరగా వేయదు.
పనీర్‌లోని లినోలెక్‌ ఫ్యాటీ యాసిడ్‌కి శరీరంలోని కొవ్వును కరిగించే గుణం అధికం.
పనీర్‌లో విటమిన్‌-డి, కాల్షియంలు ఎక్కువ. ఇవి రొమ్ము క్యాన్సర్‌ని నిరోధిస్తుంది.
ముఖ్యంగా అథ్లెట్లకు పనీర్‌ ఎముక బలాన్ని పెంచే ఫుడ్‌.
యాంగ్జయిటీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్‌ రాకుండా అడ్డుకుంటుంది.
పనీర్‌లో యాంటాక్సిడెంట్‌ గుణాలు అధికం.
పనీర్‌ శరీరానికి వెంటనే ఎనర్జీని అందిస్తుంది.
శరీర కిందభాగంలోని నొప్పులు, అలాగే వెన్నునొప్పి, కీళ్ల బాధలను తగ్గిస్తుంది.
రుమటాయిడ్‌ ఆర్త్రరైటి్‌సపై కూడా బాగా పనిచేస్తుంది.
దంత క్షయం నుంచి కాపాడుతుంది.
స్కెలిటల్‌ డిఫార్మేషన్‌ రాకుండా అడ్డుకుంటుంది.
మధుమేహం బారిన పడకుండా నిరోధిస్తుంది.