అతిగా తింటున్నారా?

11-11-2017: అన్నంగాని, స్నాక్స్‌గాని అతిగా తింటున్నారా... ఈ అలవాటును పోగొట్టుకోవడానికి కొన్ని టిప్స్‌ ఉన్నాయి. అవేమిటంటే...

టివి చూస్తూ, పేపర్‌ చదువుతూ ఆహారం తినొద్దు.
మీరు ఎలాంటి ఆహారం తింటున్నారో గమనించుకుంటుండాలి.
వంటకాల రుచి తొలిముద్దల్లోనే బాగా ఉంటుంది. ముద్దల సంఖ్య పెరిగే కొద్దీ రుచి చిగుళ్లు స్పందించడం తగ్గుతుంది. అందుకే కొన్ని ముద్దలు మాత్రమే తినాలి.
ఫుడ్‌ కనువిందుగా ఉంటే అది మనం తీసుకునే ఆహారంపై కూడా ప్రభావం చూపుతుంది. అలాంటప్పుడు మీ ఎదుట ఉన్న ఫుడ్స్‌ను గమనించుకుని తగిన పరిమాణంలో మాత్రమే తినాలి.
వేగంగా కాకుండా అన్నాన్ని బాగా నములుతూ మెల్లగా తినాలి.
పీచుపదార్థాలు, నీరు, ప్రొటీన్లు ఉన్న పదార్థాలను తీసుకోవాలి.
కాలరీలకు దూరంగా ఉండాలి.
మీ ఆహారపు అలవాట్లను గమనించుకోవాలి. వాటిని ఒక పుస్తకంలో రాసుకోవాలి. రోజూ తింటున్న ఆహార పరిమాణం తోపాటు భోజన వేళలను కూడా గమనించాలి.
నిత్యం 30-45 నిమిషాలు వ్యాయామం చేయాలి.
రోజూ 10-12 గ్లాసుల మంచినీళ్లను తాగాలి. ప్రతి గంటకు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల ఎక్కువ ప్రమాణంలో ఆహారం తినడం తగ్గుతుంది.
బాగా నిద్రపోతే బ్రెయిన్‌పై ఒత్తిడి ఉండదు. అయితే...నిద్ర సరిగా పోకపోతే మాత్రం ఒత్తిడి బాగా పెరిగి ఆహారాన్ని అతిగా తినే ప్రమాదం ఉంది.