బొప్పాయి తినకూడదా?

అపోహ: గర్భిణులు బొప్పాయి తింటే అబార్షన్‌ అవుతుంది!

వాస్తవం:బొప్పాయిలో విటమిన్‌ ఎ పుష్కలంగా ఉంటుందనే మాట నిజమే! విటమిన్‌ ఎ విపరీతంగా తీసుకుంటే అబార్షన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే గర్భ విచ్ఛిత్తి జరిగేటంత విటమిన్‌ ఎ అందాలంటే కనీసం 5 కిలోల మేర బొప్పాయి తినాలి. ఇంతమేర గర్భిణులు తినలేరు కాబట్టి బొప్పాయి తినటం వల్ల అబార్షన్‌ జరుగుతుందని అనుకోవటం పొరపాటు. మిగతా పళ్లకులాగానే బొప్పాయిని పరిమితంగా తీసుకోవటం వల్ల ప్రమాదం ఉండదు.