పొద్దున రాజులా.. రాత్రికి బంటులా!

లాస్‌ ఏంజిలిస్‌, జూలై 23: ఉదయం వేళల్లో తీసుకునే అల్పాహారం కాస్త భారీగా ఉండేట్లు చూసుకుంటే శరీర బరువు నియంత్రణలో ఉంటుందని శాస్త్రవేత్తలు సూచించారు. ‘పొద్దున రాజులా, మధ్యాహ్నం మంత్రిలా, రాత్రికి బంటులా తినాలి’ అనే సామెత అక్షరాలా నిజమన్నారు. ఉదయం తీసుకునే ఆహారం హెచ్చు మోతాదులో ఉంటే స్వీట్లు, చిరుతిళ్ల జోలికి పోవాలనిపించదని, దాంతో బరువు పెరిగే అవకాశం ఉండదని 50 వేల మంది వలంటీర్లపై చేసిన పరిశోధనల్లో కనుగొన్నారు.