బాదాంతో ఆరోగ్యం బాగు

ఆంధ్రజ్యోతి,12-9-2016:బాదాంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ బ్లడ్‌ సెల్స్‌ డ్యామేజ్‌ను అరికడతాయి. క్యాన్సర్‌ కారక కణాలను అరికట్టడంలోనూ ఇవి మంచి పనితనం చూపిస్తాయి.

బాదాంలో పుష్టిగా ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మం నిగనిగలాడేందుకు కూడా దోహదం చేస్తాయి.

ఇందులో ఉండే విటమిన్‌-ఇ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంపొదిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా బాదాం మేలు చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నిషియం డయాబెటిక్‌ను కంట్రోల్‌ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బీపీని అదుపులో ఉంచుతుంది.
బాదాం నుంచి లభించే ఫైబర్‌, ప్రొటీన్లు ఆకలిని ఇట్టే తగ్గించేస్తాయని ఓ స్టడీలో తేలింది.
శరీరం బరువు తగ్గించడంలోనూ బాదాం క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. రోజుకు నాలుగైదు బాదాం పప్పులు తినడం వల్ల శారీరక అలసట దూరం అవుతుంది.
బాదాంలో సమృద్ధిగా ఉండే కాపర్‌, కాల్షియం ఎముకల్లో పటుత్వం పెంచడంతో పాటు, కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి.