పొట్ట పాడయిందా?

27-05-2019:కడుపు ఉబ్బరం, నొప్పి, మలబద్ధకం, అజీర్తి... జీర్ణవ్యవస్థ కుంటుపడింది అనడానికి సూచనలు. ఇలా జరగడానికి కారణం, కొవ్వులు, ఉప్పు, తీపి, మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా తినడమే! ఇలాంటప్పుడు తిరిగి జీర్ణ వ్యవస్థ గాడిలో పడేవరకూ కొన్ని ఆహార నియమాలు పాటించాలి.
 
వెజిటబుల్‌ ఆయిల్‌, మైదా పిండి, చక్కెరలతో తయారైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.
కొబ్బరి నూనె లాంటి తేలికైన నూనెలతో తయారైన పదార్థాలు తింటూ, సూప్స్‌ లాంటివి తాగాలి. ఇలా చేస్తే పేగుల లోపలి గోడలు బలపడతాయి.
మంచి బ్యాక్టీరియాను పెంచడం కోసం పెరుగు తినాలి.
జీర్ణవ్యవస్థలోని వ్యర్థాలు తొలగిపోవడం కోసం ఎక్కువగా నీళ్లు తాగాలి.
సమస్యలు తొలగిపోయేవరకూ తేలికగా అరిగే ఆహారం తీసుకోవాలి.
మిరియాలు, అల్లం, వెల్లుల్లి ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.