కారం ఎంత ఉందో చెప్పే ఈ-టంగ్‌!

వాషింగ్టన్‌, మే 13: నేడు మార్కెట్‌లో అనేక రకాల స్పైసీ ఫుడ్‌ లభ్యమవుతున్నాయి. చూడ్డానికి బాగానే ఉన్నా.. నోట్లో పెట్టుకోగానే కారం ఘాటు నషాలానికి ఎక్కుతుంది. అయితే వాషింగ్టన్‌ స్టేట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఆహారంలో కారం ఎంత ఉందో కచ్చితంగా గుర్తించే ఈ-టంగ్‌ (ఎలక్ర్టానిక్‌ నాలుక)ను రూపొందించి సమస్యకు పరిష్కారాన్ని చూపించారు. ఈ-టంగ్‌ స్పైసీ ఫుడ్‌లోని రుచిని మనుషుల కంటే కచ్చితత్వంతో గుర్తింస్తుందని వారు పేర్కొన్నారు. రెండు శాంపిల్‌ ప్యాకెట్ల మధ్య రుచిలో తేడాను కూడా ఇది చెప్పేస్తుందని తెలిపారు.