ఈ మూలికలు, పండ్లతో రోగనిరోధక వ్యవస్థ పెరుగుతోంది...

ఆంధ్రజ్యోతి(19-10-2016): దాల్చిన చెక్క, అల్లం వంటి యాంటీవైరల్ మూలికలతో కలిపి కాలానుగుణంగా సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా మనలోని రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవచ్చని చెపుతున్నారు శాస్త్రవేత్తలు. అల్లం రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతోందని వారు పేర్కొన్నారు. శరీరం నుంచి అధిక తేమను తప్పించేందుకు అల్లం, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలు కూరల్లో జోడిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెపుతున్నారు.. సీజన్లలో మార్పువచ్చినపుడు నారింజకాయలు, బంగాళాదుంప, గుమ్మడికాయలు ఆహారంలో తీసుకోవడం మేలంటున్నారు. వాము ఆకు జలుబు, ఫ్లూ, సైనసిటిస్ కు వ్యతిరేకంగా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతోందట. నిమ్మకాయలు, నారింజ, ద్రాక్ష, కివీస్ పండ్లలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. దీని వల్ల వైరల్ అంటువ్యాధులు నివారించవచ్చంటున్నారు. ప్రతిరోజూ తాజా పండ్లు తీసుకోవటం ఆరోగ్యానికి మేలంటున్నారు పోషకాహార నిపుణులు. తేనె మెదడుకు టానిక్ లాగా ఉపయోగపడుతుందని కూడా పోషకాహార నిపుణులు వివరించారు.