టొమాటోలు రోజూ తింటే...!

23-07-2017: రోజూ టొమాటోలు తింటే చర్మ కేన్సర్‌ రాదుట. ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎర్రని టొమాటోలు తినడం వల్ల అతినీలలోహిత కిరణాల దుష్ప్రభావం మన చర్మం మీద పడదు. పోషకపదార్థాలు తీసుకోవడం వల్ల చర్మ కేన్సర్‌ రిస్కు ఎంతవరకూ తగ్గుతుందన్న అంశంపై శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. టొమాటోలకు, కేన్సర్‌కు ఉన్న సంబంధమేమిటని గమనిస్తే, వాటికి ఎర్రని రంగునిచ్చే డయటరీ కాంపౌండ్స్‌ అయిన కెరటెనాయిడ్స్‌, పిగ్మెంటింగ్‌ కాంపౌండ్స్‌ ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు గ్రహించారు. అవే అతినీలలోహిత కిరణాల దుష్ప్రభావం నుంచి మనల్ని కాపాడుతున్నాయని పరిశోధకులు తేల్చారు.