కాఫీ ఆరు కప్పులు దాటితే గుండెకు చేటు!

మెల్‌బోర్న్‌, మే 13: చాలామందికి కాఫీ లేనిదే రోజు మొదలుకాదు. అయితే రోజుకు 6 కప్పులకు మించి కాఫీ తాగితే అది ఆరోగ్యానికి హానికరమని, దానివలన గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 22 శాతం పెరుగుతుందని సౌత్‌ ఆస్ర్టేలియా వర్సిటీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో గుర్తించారు. కాఫీలో ఉండే కెఫిన్‌ అనే పదార్థం ఏ మేరకు ప్రభావం చూపుతుందో గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేపట్టారు.  కెఫిన్‌ ఎక్కువగా తీసుకోవడం హై బీపీకి కారణం అవుతుందని, దానివలన గుండె జబ్బులు సంభవిస్తాయని వారు గుర్తించారు.