స్టయిలిష్ ముఖ్యమా?.. ఆరోగ్యం కావాలా?

26-09-2017: మారుతున్న కాలంతోపాటు ఆహారపు అలవాట్లలోనూ అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో ఆహారం చేతులకు తగలకుండా, పెదాలకు అంటకుండా స్పూన్‌తో స్టయిలిష్‌గా తినడం చాలామందికి అలవాటైపోయింది. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారు చెప్పినదాని ప్రకారం ఆహారాన్ని చేయి తాకగానే ఙ్ఞాన‌నాడుల ద్వారా మెదడు, పొట్టకు సంకేతాలు అందుతాయి. దీంతో జీర్ణరసాలు, ఎంజైములు విడుదలై జీర్ణక్రియ సక్రమంగా సాగేందుకు తోడ్పాటునందిస్తుంది. చేతితో ఆహారం తినడం వలన శరీరానికి ఒక రకమైన వ్యాయామం జరుగుతుంది. వేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు చేతిలోని చిన్న చిన్న నరాలు ఉత్తేజితమవుతాయి. పూర్వకాలంలో ఆహారాన్ని చేతితోనే తీసుకునేవారు. అందుకే వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నిపుణులు చెబుతున్నారు. వీలైతే ఆకులో ఆహారం వడ్డించుకుని, నేలపై కూర్చుని తింటే మంచిదని కూడా సూచిస్తున్నారు. నేలమీద కూర్చుని తినేటప్పుడు పొట్టలోని కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో జీర్ణరసాలు సక్రమంగా విడుదలై ఆహారంలో కలవడం ద్వారా జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఇది అధిక బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది.