టీనేజ్‌ ఫిట్‌నెస్‌

22-08-2017:చదువు, కెరీర్‌ ముఖ్యమే గానీ, శరీరానికి కాస్తంత శ్రమ కలిగించకపోతే, స్థూలకాయం గ్యారెంటీ. స్కూలు, కాలేజ్‌ పిల్లల్లో కొందరు ఊబకాయంతో ఉండడం గమనించే ఉంటారు. గంటలు గంటలు మొబైల్‌ మీదో, నెట్‌ చాటింగ్‌ మీదో గడిపే సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. సమస్య టైం లేకపోవడం కాదు. వ్యాయామం ప్రాధాన్యతను గుర్తించకపోవడమే. అలాగని ఈ వయసులో వెయిట్‌ లిఫ్టింగ్‌, హెవీ రన్నింగ్‌లు చేయకూడదు. ఎముకలు వంకర్లు పోయే ప్రమాదం ఉంది. అలాంటివి 18 ఏళ్లు దాటాకే చేయాలి. అప్పటిదాకా సాదాసీదా వ్యాయామాలు, స్కూల్లో చెప్పే డ్రిల్‌ చేస్తే చాలు. వీటితో పోటు కొన్ని యోగాసనాలు, ప్రాణాయామాలు మంచిది.

వ్యాయామాలు స్థూలకాయం రాకుండా కాపాడటమే కాదు. శరీరాన్ని, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దాంతో గ్రహణ శక్తినీ, ఏకాగ్రతా బలాన్ని పెంచుతాయి.
కండరాలు బలపడి, ఎముకలు ఏపుగా ఎదిగి, కావలసిన ఎత్తుపెరిగేలా చేస్తాయి.
నిద్రలేమి, మలబద్ధకం వంటి సమస్యలనుంచి దూరంగా ఉంచుతాయి.
శరీరాన్ని ఉత్సాహంగా, మనసును ఉల్లాసంగా చైతన్యవంతంగా ఉంచుతాయి.
యోగా, వ్యాయామాలు ప్రత్యేకించి విద్యార్థులకు కావలసిన జ్ఞాపకశక్తిని పెంచుతాయి.