నేడు అంతర్జాతీయ ఫిట్‌నెస్‌ దినోత్సవం

ఫిట్‌నెస్‌ బెస్ట్‌ ఫుడ్‌..
మధుమేహం మొదలు కేన్సర్‌ వరకూ నివారించడంలో సహాయపడతాయంటున్న న్యూట్రిషిని్‌స్టలు

కాలు కదపాల్సిన అవసరం లేకుండా అన్నీ మనకు చేరువవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. క్యాబ్‌ మొదలు ఫుడ్‌ వరకూ అన్నీ ముంగిటకొస్తున్నాయి. ఇక కార్పొరేట్‌ ఉద్యోగాలలో ఏసీ జీవితాలూ ఎలాగూ ఉన్నాయి. మన జీవనచిత్రం పూర్తిగా మారిపోయింది. దాంతో పాటూ ఆరోగ్యమూ పాడైపోతోంది.

ఫుడ్ ట్రెండ్స్...

మన పూర్వీకులకున్నంతటి ఆరోగ్యం మనకు లేదని నిట్టూరుస్తాం కానీ మనం ఏం తినాలనేది ఆలోచించం. టేస్టీగా ఉండాలి.. కంటికీ నచ్చాలి.. అనే కాన్సె్‌ప్టతో ముందుకు వెళ్తూ జంక్‌ పుడ్‌ను తినేస్తున్నాం.  వ్యక్తిగత శ్రద్ధ తగ్గడం.. సంప్రదాయ ఆహారపద్ధతులను వదిలి సమయం లేదంటూ ఫాస్ట్‌ఫుడ్స్‌కు అలవాటు పడటంతో ఫాస్ట్‌గానే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఫిట్‌నెస్‌పై ప్రేమతో జిమ్‌ల వెంట పడినా సరైన ఫుడ్‌ తినకుండా ఎంత కష్టపడితే మాత్రం ఫలితమేముంటుందనేది డైటీషియన్‌,  న్యూట్రిషిని్‌స్టల ప్రశ్న. శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవటంతో ఇటీవల డయాబెటి్‌స,కేన్సర్‌  రోగుల సంఖ్య పెరగడానికి మనం  తినే తిండే కారణమవుతోందంటున్నారు. చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదంటూనే ఫిట్‌నెస్‌ అంటే శారీరక పుష్టి మాత్రమే కాదని మానసిక, శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండటమే ఫిట్‌నె్‌సకు అసలైన నిర్వచనమనీ సెలవిస్తున్నారు.

ఆరోగ్యవంతమైన శరీరానికి చిరుధాన్యాలే మేలు

నగరంలో చాలామందికి పావురాలను చూడగానే జొన్నలు,సజ్జలు లాంటివి కొని చల్లడం అలవాటు. జొన్నలు, సజ్జలు పక్షులకు మాత్రమేనా? మనుషుల సంగతేంటి అంటే.. మారిన ఆహారపు అలవాట్లే గుర్తుకొస్తాయి.  నిజానికి నేడు ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగిస్తోంది...ఈ చిరు ధాన్యాలనే. చిరుధాన్యాలలో ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉండటమే కాదు.. మారిన జీవనశైలి వల్ల వచ్చే మధుమేహం, హైపర్‌లిపిడెమియా, అనీమియా, పౌష్టికాహార లేమి వంటి సమస్యలకూ పరిష్కారం చూపుతాయి. నిజానికి మనం రోజూ తినే రైస్‌, చపాతీ కన్నా ఈ చిరు ధాన్యాలతో చేసుకున్న ఆహారపదార్థాలు మేలు చేస్తాయంటున్నారు డైటీషియన్‌ అమృత. మధుమేహ రోగులు రైస్‌ తినటం తగ్గించాల్సిందేనంటున్నారు. కార్బోహైడ్రేట్లు త్వరగా శరీరానికి అందించటంలో బియ్యం కీలకపాత్ర పోషిస్తాయి. పైగా డైటరీ ఫైబర్ల శాతం దీన్లో చాలా తక్కువ. గోధుమల అన్నం లేదా చపాతీ లాంటివి కూడా కార్బోహైడ్రేట్లను శరీరానికి అందించినా కాస్త తక్కువ పరిణామంలోనే అది ఉంటుంది. కానీ జొన్నల్లో డైటరీ ఫైబర్లు అత్యధిక స్థాయిలో ఉంటాయి. బియ్యం, గోధుమలతో పోలిస్తే జొన్నలు, కొర్రలు వంటివి తినటం వల్ల చక్కెర వ్యాధి గ్రస్థులకు లాభం.. ఎందుకూ అంటే..  జీర్ణవ్యవస్థను రెగ్యులేట్‌ చేస్తుంది. ఒక్కసారే కార్బోహైడ్రేట్లు విడుదల కాకుండా కొంచెం కొంచెంగా విడుదల చేయటం వల్ల త్వరగా ఆకలి అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అత్యధిక స్థాయిలో విటమిన్స్‌, మినరల్స్‌, మెగ్నీషియం, జింక్‌, ఐరన్‌ లాంటి పోషక పదార్థాలు కూడా వీటిల్లో ఎక్కువగా లభిస్తాయి. అందువల్లనే జొన్నలు, కొర్రలు లాంటి వాటిని ఇటీవల   ఎక్కువగా డయాబెటిక్‌ పేషంట్లు తీసుకుంటున్నారు.  నాలుగు చపాతీలు తినటం కన్నా రెండు జొన్నరొట్టెలు తింటే ఎంతో మేలు. ఎసిడిటీ సమస్యల నుంచి కూడా జొన్నలు కాస్త ఉశమనం కలిగిస్తాయని పరిశోధనల్లో తేలింది. అలాగే ఈ చిరుధాన్యాల్లో అధికంగా మెగ్నీషియం ఉండటం వల్ల రక్తపోటు నివారించి, హార్ట్‌,బ్రెయిన్‌ స్ట్రోక్‌ కూడా నివారిస్తాయి. వీటిలో ఉండే పొటాషియం.. రక్తపోటు నివారించడంతో పాటుగా రక్తప్రసరణ వ్యవస్థనుసైతం సరిగా ఉంచుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయిప్పుడు.
పేద వాడి భోజనమే బెస్ట్‌ !
ఒకప్పుడు పేదవాడి ఆహారంగా వినుతికెక్కిన జొన్న రొట్టె కాలక్రమంలో కనుమరుగైనా ఇప్పుడు మాత్రం మళ్లీ పూర్వ స్థాయిని అందుకోవడం విశేషం. ఇళ్లల్లో జొన్నరొట్టె చేసుకోవడం కుదరదనుకునే వారి కోసం ఇప్పుడు కర్రీ పాయింట్ల వద్ద వీటిని ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు.కేవలం జొన్నలు మాత్రమేనా రాగులు, కొర్రలు,సజ్జలు, అరికెలు, సామా. ఉడలు.. ఇలా చిరుధాన్యాలన్నీ కూడా ఇప్పుడు ఆరోగ్యప్రియుల ప్లేట్లలో చేరిపోతున్నాయి. ఇప్పుడు చాలామందికి ఆహారం పట్ల అవగాహన పెరిగింది. కానీ ముడి సజ్జలు, కొర్రలు తీసుకోవడం ఇబ్బందిగా భావిస్తుంటారు. ఇలాంటి వారికి ఆకట్టుకుంటూనే కావాల్సిన ఆరోగ్యం అందించేందుకు తాము ప్రయత్నిస్తున్నామంటున్నార స్టార్టప్‌ సంస్థ ఇన్నర్‌ బీయింగ్‌ వెల్‌నెస్‌  ఫౌండర్‌ జాదవ్‌.  ప్రజలకు పోషకాహారం పట్ల ఆసక్తి కలిగించటానికి ఇప్పుడు ఈ జొన్నలనే పాస్తా, పాప్‌ కార్న్‌, రవ్వ, పిండి, బిస్కెట్లు,సేమియా రూపంలో అందిస్తున్నామంటున్నారు. ఈ చిరుధాన్యాలతో రూపొందించిన పలు ఉత్పత్తులను ఎన్నో సంస్థలు మార్కెట్‌లో విడుదల చేస్తున్నాయి. సంప్రదాయ ఆహారం.. పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి అని చెబితే ఎవరూ అటు వైపు చూడటం లేదు. నోటికి రుచి ఉండాలి.. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌.. ,ప్రత్యేకత ప్రొడక్ట్‌ ఎంపికలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అది దృష్టిలో పెట్టుకునే యూత్‌, చిన్నారులను ఆకట్టుకోవటం కోసం పాస్తా, బిస్కె ట్లు, వర్మిసెల్లీ, ఫ్లేక్స్‌.. ఇలా విభిన్నంగా చిరుధాన్యాలను అందిస్తున్నారు. ఉన్నత వర్గాల వారు కూడా ఈ ఫుడ్‌ను ఇప్పుడు ఇష్టంగా తింటున్నారని డైటీషియన్లు పేర్కొంటున్నారు. డైట్‌లో కార్బో హైడ్రేట్లు తీసుకోవటాన్ని పరిమితం చేసుకోవాలని, జొన్నలు, రాగులు, కొర్రలు లాంటి చిరుధాన్యాలతో శరీరానికి అవసరమైన పోషకాలన్నీ తీసుకోవటం సాధ్యమవుతుందనీ చెబుతున్నారు.