ఎలాంటి ఫుడ్‌ వర్కవుట్‌ అవుతుంది?

15-03-2019: వర్కవుట్‌ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార నియమాలు చెప్పండి. ఏ ఆహారం ఎలాంటి వ్యాయామానికి మంచిదో వివరించండి.         -కావేరి
ఏ వ్యాయామమైనా సరే ఒక పద్ధతి తప్పనిసరిగా పాటించాలి. సాధారణంగా అందరూ ఆచరించదగ్గ పద్ధతి ఈ విధంగా ఉంటుంది.
వ్యాయామానికి ముందు: శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. పొట్ట నిండుగా తినొద్దు. దీనికి డ్రైఫ్రూట్స్‌ మంచివి. ఉదాహరణకు ఎండు ద్రాక్ష, ఖర్జూరా, ఆప్రికాట్‌, అంజీర మొదలైనవి. ఇవి వ్యాయామానికి ముందు ఒక గుప్పెడు తీసుకోవాలి.
 
వ్యాయామం సమయంలో: వర్కవుట్‌ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్‌ తీసుకుంటూ ఉండాలి. ఆ సమయంలో కొద్దిగా నీరు తీసుకోవాలి. భారీ వర్కవుట్స్‌ చేసేవారు ఉప్పు కలిపిన నిమ్మరసం తీసుకోవాలి. ఇది శరీరంలో కోల్పోయిన ఉప్పుని తిరిగి ఇచ్చి, శక్తి కోల్పోకుండా చేస్తుంది.
వర్కవుట్‌ అయిన తర్వాత: వర్కవుట్‌ కాగానే సాధారణంగా శరీరం అలసిపోతుంది. ఈ సమయంలో ప్రొటీన్‌ పౌడర్‌ మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. లేకపోతే గుడ్డు, గ్లాసు మజ్జిగ తీసుకోవచ్చు. ఈ విధంగా వ్యాయామ సమయంలో ఒక నిర్ధిష్టమైన పద్ధతి పాటిస్తే చక్కని ఫలితం ఉంటుంది.