ఫిట్‌నెస్‌ బ్లాగర్‌

25-02-2019: కార్పొరేట్‌ కంపెనీలో మంచి ఉద్యోగం. కానీ ఆమె మనసంతా ఫిట్‌నెస్‌ మీద ఉండేది. దాంతో ఉద్యోగానికి గుడ్‌ బై చెప్పేసి తనకిష్టమైన రంగంలో దిగాలనుకున్నారు. అప్పటికే ఆమె ఇద్దరు పిల్లల తల్లి. అయితేనేం తనలాంటి తల్లులకు, యువతకు ఫిట్‌నెస్‌ పాఠాలు చెప్పేందుకు ‘హెల్తీఫిట్‌’ బ్లాగ్‌ ప్రారంభించారు పంజాబ్‌కు చెందిన తాన్యా అగర్వాల్‌. ఈ ఫిట్‌నెస్‌ బ్లాగర్‌ చెబుతున్న విశేషాలు...
 
ఫిట్‌నెస్‌ కోసం...
మిమ్మల్ని ఫిట్‌గా, మానసికంగా దృఢంగా ఉంచే వ్యాయామాలు చేయండి.
మానసిక ప్రశాంతతకు ఉపకరించే వ్యాయాయాలను ఎంచుకోండి.
ట్రెండింగ్‌ ఎక్సర్‌సైజ్స్‌ చేయండి.
మీరు చేసే పనిని ప్రేమించండి.
మాది పంజాబీ కుటుంబం... నాన్న గవర్నమెంట్‌ ఉద్యోగి. ఆయన బదిలీల కారణంగా పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో నా చదువు సాగింది. చండీగఢ్‌లో ప్రాథమిక విద్య పూర్తిచేశా. ముంబయిలోని ‘నార్సీ మాంఝీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీ్‌స’లో (ఎన్‌ఎమ్‌ఐఎమ్‌ఎస్‌) పీజీ, ఆ తరువాత ఒక కార్పొరేట్‌ కంపెనీలో అయిదేళ్లు ఉద్యోగం చేశాను. ఆ సమయంలోనే టీచింగ్‌ మీద ప్యాషన్‌తో జీమ్యాట్‌ విద్యార్థులకు క్లాసులు చెప్పేదాన్ని.
 
బ్లాగ్‌ ఆలోచన వెనుక...
పంజాబీ ఫ్యామిలీ కావడంతో ఇంట్లో స్వీట్స్‌ ఎప్పుడూ ఉండేవి. వాటిని తినకుండా ఉండలేని పరిస్థితి. అయితే నాన్న ప్రభావంతో బాల్యం నుంచే శారీరకంగా ఫిట్‌గా ఉండడం అలవాటైంది. నన్ను ఉదయాన్నే నిద్ర లేపి, తన వెంట సైక్లింగ్‌కు తీసుకెళ్లేవారు నాన్న. అయితే పెళ్లయ్యాక ఫిట్‌నె్‌సకు కొన్నాళ్లు దూరంగా ఉన్నా. నేను రెండోసారి గర్భం దాల్చినప్పుడు ఫిట్‌నెస్‌ మీద మళ్లీ దృష్టి సారించాలనుకున్నా. అప్పటికి నాకు ఇరవై అయిదేళ్లు. ప్రారంభంలో నడవడం, యోగ చేయడం వంటివి మొదలుపెట్టా. ప్రెగ్నెంట్‌గా ఉన్న మహిళలు వాకింగ్‌ చేయడం, ప్రి-నేటల్‌ యోగా క్లాసులకు వెళ్లడం నేను చూడలేదు. ‘మహిళలను ప్రెగ్నెన్సీ అనేది ఫిట్‌నె్‌సకు ఎలా దూరం చేస్తుంది? రోజుకు రెండుసార్లు మాత్రమే తినాలంటారు ఎందుకు?’ వంటి ప్రశ్నలు నన్ను ఆలోచనలో పడేశాయి. అలా నా మనసులో గూడుకట్టుకున్న ప్రతి విషయాన్ని కాన్పు తర్వాత రాయాలని అప్పుడే అనుకున్నా. రెండో పాప కొంచెం పెద్దయ్యాక ‘హెల్తీఫిట్‌’ బ్లాగు క్రియేట్‌ చేసి, ఫిట్‌నెస్‌ సూత్రాలు రాయడం మొదలెట్టాను. యోగ, రన్నింగ్‌, పైలేట్స్‌, ఫిట్‌నెస్‌ ఫుడ్‌, ధ్యానం, వర్కవుట్‌కు సరిపోయే దుస్తులు.. ఇలా ఫిట్‌నె్‌సకు సంబంధించిన ప్రతి విషయం గురించి రాసేదాన్ని. నేను ఉపయోగిస్తున్న, నాకు నచ్చిన హెల్తీఫుడ్‌, ఉత్పత్తుల రివ్యూలు రాస్తాను. ఫిట్‌నె్‌సపై ఆసక్తి ఉన్నవారు తమ సలహాలు, సూచనలు రాసే అవకాశం కూడా ఉంది. అంతేకాదు వినియోగదారులకు ఫిట్‌నె్‌సకు ఉపయోగపడే ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని రెస్టారెంట్స్‌, కేఫ్‌ యజమానులను కోరతాను. అందరూ హెల్తీలై్‌ఫను ఆస్వాదించాలన్నదే నా ఆలోచన.