కొద్దిసేపు నడకతో తగ్గే కొవ్వు

28-6-2017: గంటల కొద్దీ ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో కాసేపు నడవడం ఆరోగ్యానికి మంచిదని ఓ పరిశోధనలో తేలింది. దీనివల్ల కొవ్వు తగ్గుతుందని పరిశోధకులు వెల్లడించారు. గంటల తరబడి కూర్చోవడం లేదా ఆఫీసుల్లో గంటలకొద్దీ కదలకుండా కూర్చుని పనిచేయడం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ప్రతి అరగంటకు ఓ సారి రెండు నిమిషాల పాటు నడవడం ఆరోగ్యానికి మంచిదని సూచించారు. రక్తంలో చక్కెర, ఇన్సులిన్‌ స్థాయి  తగ్గుతుందని తెలిపారు. అమెరికాలోని ఒటాగో  వర్సిటీ పరిశోధకులు 36 మందిపై పరిశోధన  చేశారు.