టీవీ చూస్తే నడవలేరు!

01-09-2017: గంటల కొద్దీ కూర్చోవడం, టీవీకి అతుక్కుపోవడం వల్ల శారీరక శ్రమ లేక వృద్ధుల్లో నడవలేని పరిస్థితి ఎదురవుతుందని అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజుకు ఐదు గంటలకంటే ఎక్కువసేపు టీవీ చూస్తూ, వ్యాయామం సరిగా చేయనివారిలో ఈ వ్యాధి ఏర్పడుతుందని వెల్లడించారు. ఇంటిపనులు, తోట పనులు, వ్యాయామం చేస్తే చురుగ్గా ఉంటారని వివరించారు.