వ్యాయామానికి ముందు...

09-10-2018: ఎముకలు బెణకకుండా ఉండాలన్నా, కండరాలు పట్టేయకుండా ఉండాలన్నా, వ్యాయామం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే....
వ్యాయామానికి ముందు వార్మప్‌ ఎక్సర్‌సైజ్‌ తప్పనిసరిగా చేయాలి. ఇందులో భాగంగా నిలబడిన చోటనే మార్చింగ్‌ చేయాలి. లేదా కొద్ది దూరం నడవాలి.
నడిచేప్పుడు, పరిగెత్తేటప్పుడు నేల ఎగుడుదిగుడుగా ఉండకుండా చూసుకోవాలి.
వ్యాయామం వేగం క్రమేపీ పెంచాలి. అలా పెంచినప్పుడు అలసట అనిపించినా, నొప్పి కలిగినా వేగాన్ని తగ్గించాలి లేదా ఆపేయాలి.
మోకాళ్లు, కాలి గిలకలు బలహీనంగా ఉంటే సపోర్టు కోసం తగిన బ్రేసెస్‌, సాక్స్‌, క్యాప్స్‌ వాడాలి.