రేచీకటిని ఎలా నియంత్రించాలి?

ఆంధ్రజ్యోతి,14-3-2017:పగలంతా బాగానే ఉండి, రాత్రివేళే కనిపించకపోవడాన్నే రేచీకట్లు అంటారు. దీనికి గల కారణాల్లో శరరీంలో కఫం పెరిగి పోవడం ప్రధానమైనది. ఇలా కఫం పెరిగిపోవడం వెనుక ప్రకృతికీ శరీర వ్యవస్థకూ మధ్య గల అనుబంధం బయటపడుతుంది. అదేమిటంటే, పగటివేళ సూర్య కిరణాల వేడి వల్ల శరీరంలోని కఫం త గ్గిపోయి కళ్లు బాగానే కనిపిస్తాయి. రాత్రివేళ ఆ వేడి ఉండకపోవడం వల్ల శరీరంలో కఫం పెరిగిపోయి చూపు మసకబారుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఈ విధానాలు పాటించవచ్చు. 
జీలకర్ర చూర్ణాన్ని కండ చక్కెరలో కలిపి ఉదయం, సాయంత్రం సేవిస్తూ ఉంటే రేచీకట్ల సమస్య చాలా వరకు తగ్గుతుంది. 
పొద్దునా సాయంత్రం టొమాటో రసం తాగుతుంటే రేచీకట్లు అదుపులోకి వస్తాయి. 
క్యారెట్‌, టొమోటోలు, ఆకుకూరల సూపు తరుచూ తాగుతూ ఉన్నా రేచీకట్లకు బ్రేక్‌ పడుతుంది.