అందమైన కళ్ల కోసం...

19-07-2017:కంటి కింద నల్లటి మచ్చలు, వలయాల్లాంటివి చాలామందికి ఉంటాయి. అలాగే వదిలేస్తే మాత్రం మరింత ఎబ్బెట్టుగా ఉంటుంది. ముఖారవిందం తగ్గిపోతుంది. నల్లటి వలయాలను తొలగించటానికి ఈ హోమ్‌రెమిడీస్‌....
 
రోజ్‌వాటర్‌ను దూదితో అద్దుకుని కంటి కింద చారలు ఉండే చోట శుభ్రపరచుకోవాలి.
ఆల్మండ్‌ ఆయిల్‌, తేనె బాగా కలిపి ఆ మిశ్రమాన్ని నిద్రపోయే ముందు కళ్ల కింద అప్లై చేసుకోవాలి.
పాలల్లో లాక్టిక్‌ యాసిడ్స్‌, అమినో యాసిడ్స్‌, ఎంజైమ్స్‌, ప్రొటీన్స్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. అందుకే పాలతో కళ్ల కింద వలయాలను క్లీన్‌ చేసుకోవాలి.
పుదీనా ఆకుల్లో యాంటీ బాక్టీరియా, యాంటీ సెప్టిక్‌ లక్షణాలుంటాయి. కాబట్టి పుదీనా ఆకులను చేతులతో క్రష్‌ చేసి కళ్లకింద కాసేపు ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.