సోలార్‌ కళ్ల జోడు

04-08-2017: సౌరశక్తిని ఉత్పత్తి చేసే స్మార్ట్‌ సోలార్‌ కళ్ల జోడును జర్మనీలోని కార్ల్‌స్రుహర్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ టెక్నాలజీ(కిట్‌) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రంగురంగులతో, సగం పారదర్శకత, తేలికగా ఉండే ఆర్గానిక్‌ సోలార్‌ సెల్స్‌ను కలిగి ఉండే ఈ కళ్లజోడు కరెంట్‌ను ఉత్పత్తి చేసి వినికిడి పరికరాలు, స్టెప్‌కౌంటర్లు పనిచేయడానికి ఉపయోగపడతాయట.