దృష్టి లోపాలకు అనుగుణంగా మారే స్మార్ట్‌ కళ్లజోడు

వాషిగ్టన్‌, ఏప్రిల్‌ 16: వయసు పైడుతున్న కొద్దీ ఎదురయ్యే దృషి లోపాలకు పరిష్కారమే ఈ ఫొటోలోని స్మార్ట్‌ కళ్లజోడు. కంటి చూపునకు అనుగుణంగా మారే శక్తి దీనికి ఉంది. ఒకసారి దృష్టి లోపం ప్రారంభమయ్యాక సంప్రదాయకళ్లజోడు వాడతాం.. కొన్ని రోజులు పోయాక మన చూపులో వచ్చిన మార్పులకు అనుగుణంగా దాని లెన్స్‌ మార్చాల్సి ఉంటుంది. అయిుుతే, ఈ స్మార్ట్‌ కళ్లజోడుతో ఆ ఇబ్బంది ఉండదని యూనివర్సిటీ ఆఫ్‌ యూటా పరిశోధకులు చెబుతున్నారు. ద్రవాల సాయంతో తయాూరు చేసిన ఈ లెన్స్‌ మన కంటి చూపునకు అనుగుణంగా మార్చుకోవచ్చట! అచ్చంగా కంటి పనితీరుకు నకలుగా ఈ స్మార్ట్‌ కళ్లజోడు పనిచేస్తుందని వారు చెప్పారు.