కళ్లను కాపాడుకోండి!

09-10-2017:వాతావరణం చల్లగా ఉంటూ, వర్షం తరచూ పలకరిస్తున్న సమయం ఇది. ఇలాంటప్పుడే ఇన్ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మన శరీరంలో చాలా సులువుగా ఎఫెక్ట్‌ అయ్యేవి కళ్లు. అందుకోసం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇతరులు మీరు టవల్‌ మీరు వాడటమో లేక, మీ టవల్‌ వాళ్లు వాడటమో జరుగుతుంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. అలాగే కళ్లను మురికి చేతులతో ముట్టుకోవడం ఏ మాత్రం మంచిది కాదు.

కళ్లల్లో దుమ్ముపడి దురద వేస్తున్నప్పుడు అదే పనిగా రుద్దకూడదు. అలాంటప్పుడు చల్లటి నీళ్లతో మృదువుగా కడుక్కోవాలి. అప్పటికీ తగ్గకపోతే వైద్యుణ్ణి సంప్రతించండి.

కాంటాక్ట్‌ లెన్స్‌ వాడే వాళ్లు వాటిని బాగా క్లీన్‌ చేయండి. కళ్లు ఎర్రగా అయిన సమయంలో వాటిని పెట్టకపోవడం మంచిది.

కళ్లు తుడుచుకోవడానికి కర్చీఫ్‌ల కన్నా డిస్పోజబుల్‌ టిష్యూలు వాడితే ఇన్ఫెక్షన్‌లకు దూరంగా ఉండొచ్చు.