కళ్లు ఎర్రబడితే..

ఆంధ్రజ్యోతి,22-3-2017: వాతావరణ కాలుష్యం, కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌ తెరల్ని ఎక్కువ సమయం చూడటం వల్ల కళ్లు ఎర్రబడతాయి. ఒత్తిడికి గురయినట్లు అనిపిస్తాయి. కన్నీళ్లు వస్తాయి. ఇలాంటప్పుడు కళ్లను శుభ్రపరచుకోవాలి. వాటికి విశ్రాంతినివ్వాలి. 
ఒక బౌల్‌లో నీళ్లను తీసుకుని దాంట్లో రెండు, మూడు ఐస్‌ముక్కలు వేయాలి. ఈ బౌల్‌లో కొన్ని చుక్కల రోజ్‌వాటర్‌, నాలుగు చుక్కల తేనె కలపాలి. ఆ తర్వాత ఆ చల్లటి నీటిలో రెప్ప కొంచెం తెరిచి తర్వాత వెంటనే మూసేయాలి. ఇలా కొన్ని పదులసార్లు చేస్తే కళ్లలోని రెడ్‌నెస్‌ తగ్గుతుంది. కళ్లు రీఫ్రెష్‌ అవుతాయి. ఈ చిన్నపాటి ఐ వాష్‌ను సులువుగా మీరూ ప్రయత్నించి చూడండి!