ముందుచూపుతోనే కళ్లు సురక్షితం

  • వయసు పెరిగేకొద్దీ చాలామందికి కంటిచూపు మందగించడం సహజం. అయితే ముందుచూపుతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నేత్ర సమస్యలు అంత త్వరగా దరిచేరవు.
  • ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, జింక్‌, విటమిన్‌ సి, ఇ వంటివి తీసుకోవాలి. మీ శరీరంలో ఇవి తక్కువగా ఉన్నాయేమో ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకుంటే మంచిది. 
  • తాజా ఆకుకూరలు, కూరగాయలు చాలా ముఖ్యం. పాలకూర, తోటకూర, చుక్కకూర వంటివన్నీ తరచూ తింటుండాలి. 
  • విటమిన్‌-ఇ చేపల్లో ఎక్కువ. అన్ని సీజన్లలోను చేపలు దొరుకుతాయి కాబట్టి.. వీటిని తీసుకోవచ్చు. అయితే చేపలతో వేపుళ్లు కాకుండా.. కూరలు చేసుకు తినడం వల్ల చక్కటి ఫలితం లభిస్తుంది. 
  • కోడిగుడ్లు, గింజలు, పప్పుధాన్యాలు, బీన్స్‌, ఆరంజ్‌లతోపాటు సిట్రస్‌ జాతికి చెందిన పండ్లను తప్పక తీసుకోవాలి. 
  • కంటిచూపుకు ఒబెసిటీకి సంబంధం ఉంది. అందుకే బరువు పెరగకుండా చూసుకోవాలి. బరువు పెరిగితే బీపీ, షుగర్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటి వల్ల నేత్ర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కనీసం ఆర్నెళ్లకు ఒకసారి అయినా బరువును చెక్‌ చేసుకోవాలి. 
  • బీడీలు, సిగరెట్లు, చుట్టలు, హుక్కా వంటివి తాగడం వల్ల కాటరాక్ట్‌ వచ్చే ప్రమాదం ఉంది. పొగ పీల్చేవాళ్లలో నరాల జబ్బులు వస్తాయి. తద్వార కంటిచూపుకు చిక్కులొస్తాయి. కాబట్టి వెంటనే పొగతాగడం తగ్గించండి. మెల్లగా మానేసేందుకు గట్టి నిర్ణయం తీసుకోండి. 
  • వేసవిలో ఎండలు మండిపోతున్నప్పుడు సన్‌గ్లా్‌సలు పెట్టుకోకుండా బయటికి వెళ్లకండి. గ్లాసెస్‌ పెట్టుకోవడం వల్ల సూర్యుని నుంచి వచ్చే ఆలా్ట్రవయలెట్‌ కిరణాల నుంచి తప్పించుకోవచ్చు. 
  • గ్లాసెస్‌ పెట్టుకోవడం కళ్లకు సురక్షితం. గాలిలోని దుమ్ముధూళి కణాలు, పొగ, ఇతరత్రా కాలుష్యం కళ్లను తాకదు. దీనివల్ల కళ్లు ఎర్రగా మారవు. తొందరగా అలసిపోవు. 
  • ఆఫీసుల్లో కూర్చుని కంప్యూటర్‌ మీద గంటల తరబడి పనిచేసేవాళ్లు.. కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కళ్లజోళ్లు లేకుండా కంప్యూటర్‌ మీద పని చేస్తే.. కళ్లు అలసిపోతాయి. చూపు బ్లర్‌గా కనిపిస్తుంది. కళ్లు పొడిగా మారిపోతాయి. తలనొప్పి, మెడనొప్పి, వెన్నునొప్పిలతో పాటు భుజాలు లాగేస్తాయి. 
  • ప్రతి రెండు గంటలకు ఒకసారి కళ్లకు విశ్రాంతిని ఇవ్వాలి. పదిహేను నిమిషాల పాటు కళ్లు మూసుకుంటే మంచిది. కంప్యూటర్‌ మానిటర్‌కు కాస్త డిస్టెన్స్‌ మెయింటెన్‌ చేయాలి.