అంధత్వ నివారణకు వినూత్న ఐ డ్రాప్స్‌

లండన్‌: వయసు పైబడుతున్నకొద్దీ చూపు మందగించి, అంధత్వానికి దారితీసే వ్యాధులకు విప్లవాత్మకమైన ఐ డ్రాప్స్‌(కంటి మందు)ను శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులర్‌ డీజెనరేషన్‌(ఏఎండీ)గా వ్యవహరించే ఈ వ్యాధి క్రమంగా కంటి చూపును దెబ్బతీస్తూ అంధత్వానికి కారణమవుతుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రస్తుతం నేత్ర వైద్యులు ఇంజెక్ష్లన్లపై ఆధారపడుతున్నారు. అయితే, ఈ సూదిమందును నేరుగా కళ్లలోకి ఇస్తుంటారు. రోగులకు ఇది చాలా బాధాకరమైన అనుభవమని యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. సూదిమందుకు ప్రత్యామ్నాయంగా ఐ డ్రాప్స్‌ను తయారుచేశామని చెప్పారు.