‘టీ బ్యాగు’తో రిలాక్స్‌..

24-10-2017: గ్రీన్‌ లేదా బ్లాక్‌... ఎలాంటి టీ బ్యాగ్‌ అయినా కళ్ల వాపులు, మంటలను తగ్గిస్తుంది. టీలో ఉండే యాంటీ ఇరిటెంట్‌ గుణాలు కళ్ల చుట్టూ ఉండే వాపును తగ్గిస్తాయి. అయితే ఈ ఫలితాన్ని పొందాలంటే టీ బ్యాగ్‌ ఉపయోగించే విధానం గురించి తెలుసుకోవాలి. ఈ వాడేసిన 2 టీ బ్యాగులను 30 నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి.  తర్వాత వీటిని ఫ్రిజ్‌ నుంచి బయటకు తీసి, మూసిన కళ్ల మీద ఉంచుకోవాలి.  ఈ టీ బ్యాగులు కళ్లను పూర్తిగా కప్పేలా చూసుకోవాలి. 10 నిమిషాలపాటు టీ బ్యాగులను కళ్ల మీద ఉంచుకుని తీసేయాలి. ఇలా వారానికోసారి చేస్తే కళ్ల మంటలు తగ్గుతాయి.