చూపును కాపాడుకుందాం

ఆంధ్రజ్యోతి, 15-04-2017:చూపును తిరిగి రప్పించే అవకాశమే లేకుండా చేసే అత్యంత ప్రమాదకర వ్యాధి గ్లకోమా. ఈ వ్యాధి లక్షణాలు ప్రత్యేకంగా ఏమీ ఉండవు. కాకపోతే పెరిఫెరల్‌ దృష్టి లోపం కొంత కనిపిస్తుంది. ఒక వేళ సమస్య ఇంకా పెరుగుతుంటే సెంట్రల్‌ విజన్‌ కూడా దెబ్బ తింటుంది. దీని వల్ల అక్షరాలు చదవడం, టి.వి చూడటం వంటివి కష్టమవుతాయి. నిజానికి, ఒక సమగ్రమైన కంటి పరీక్షల ద్వారా గ్లకోమాను తొలిదశలోనే గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్షలో కంటి వైద్యుడు కంట్లోని ఆప్టిక్‌ నర్వ్‌, రెటీనా మీద పడుతున్న ఒత్తిడి ఆధారంగా సమస్యను అంచనా వేస్తాడు. ఒకవేళ గ్లకోమా ఉందనే అనుమానం కలిగినప్పుడు విజువల్‌ ఫీల్డ్‌ టెస్ట్‌ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తాడు.
 
ఎలాంటి చికిత్సలు ఉంటాయి? 
ఏ కారణంగానైనా ఐ- డ్రాప్స్‌ గానీ, ఇతర మందులు గానీ ఎంతమాత్రం ఉపయోగపడవని తేలిపోయిందనుకోండి. అప్పుడు ఆప్తమాలజిస్టులు లేజర్‌ ట్రీ ట్‌మెంట్‌ను గానీ సర్జరీని గానీ సూచిస్తారు. ఇవి కంట్లో నిలువై ఉన్న ద్రవాలను బయటికి పంపే సహజ మార్గాలను మెరుగుపరచడానికి గానీ, లేదా కొత్త మార్గాన్ని ఏర్పాటు చేయడానికి గానీ ఉపయోగపడతాయి. అయితే, ఇవేవీ సమస్యను సమూలంగా తొలగించకపోయినా, కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి.