టీవీ వీక్షణంలో.. అంధులకు కొత్త సాఫ్ట్‌వేర్‌

లండన్‌: టీవీ తెరపై కదిలే బొమ్మలను అంధులుచూసే అవకాశంలేదు.. కేవలం శబ్దాలను వింటూ సరిపెట్టుకుంటారు. చెవిటివారి విషయంలో ఇది పూర్తిగా వ్యతిరేకం. ఈ పరిమితిని సడలించి అంధులకు టీవీ వీక్షణంలోని అనుభూతిని పెంచే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. చెవిటి వారికీ ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతుందని దీన్ని రూపకర్తలు తెలిపారు. పెర్వాసివ్‌ఎ్‌సయూబీగా వ్యవహరించే ఈ సాఫ్ట్‌వేర్‌ ఉంటే మధ్యలో ఎలాంటి పరికరాల అవసరం లేకుండానే టీవీ వీక్షణాన్ని అంధులు ఎంజాయ్‌ చేయవచ్చని వివరించారు. సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానంగా వచ్చే యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే.. తెరపై వచ్చే సబ్‌టైటిల్స్‌ను బ్రెయిలీలో చదువుకోవచ్చని చెప్పారు.