షుగర్‌ లెస్‌ సన్నాలు

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): మధుమేహం వ్యాధిగ్రస్తుల కోసం కొత్త రకం ధాన్యం సాగవుతోంది. దీని పేరు 15048 ఆర్‌అండ్‌ఆర్‌. షుగర్‌ లెస్‌ సన్నాలు అని కూడా పిలుస్తున్నారు. ఈ ధాన్యంలో కార్బొహైడ్రేట్లు (పిండి పదార్థాలు) 75 శాతం ఉంటాయి. సాధారణ రకాల్లో 53 శాతం ఉంటాయి. 75 శాతం పిండి పదార్థం ఉండటం వల్ల తీపి తక్కువగా ఉంటుంది. బియ్యం గింజలు నోట్లో వేసుకుంటే తీపిగా ఉండవు. ఈ రకం బియ్యం తినడానికి షుగర్‌ పేషెంట్లు ఆసక్తి చూపుతున్నారు. సాధారణ రకం వరి పంట 140 నుంచి 150 రోజుల్లో కోతకు వస్తుండగా.. దీనికి 120 రోజులు సరిపోతుంది. తూర్పు గోదావరి జిల్లా కేశవరానికి చెందిన సలాది శివన్నారాయణసహా మరో 30 మంది రైతులు దీన్ని సాగు చేశారు. గతేడాది 75 కిలోల బస్తాను రూ.1800కు అమ్మినట్టు శివన్నారాయణ చెప్పారు.