చెమటతో చక్కెర స్థాయిని తెలిపే సెన్సర్‌

20-09-2017: చెమటతోనే శరీరంలోని చక్కెర స్థాయులను గుర్తించే పేపర్‌ ఆధారిత సెన్సర్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం రక్తనమూనాలను సేకరించి చక్కెర స్థాయిని గుర్తిస్తున్నారని, కానీ, రక్తం చిందించాల్సిన అవసరం లేకుండా తాము రూపొందించిన సెన్సర్‌ను చేతికి ధరిస్తే చాలు.. అది స్వేదాన్ని స్వీకరించి చక్కెర స్థాయిని తెలుపుతుందని అమెరికాలోని బింఘంప్టన్‌ యూనివర్సిటీ, స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ పరిశోధకులు తెలిపారు