మధుమేహం స్థాయిని గుర్తించే కృత్రిమ క్లోమం

18-10-2017: శరీరంలో చక్కెర స్థాయులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకొని, అవసరమైన ఇన్సులిన్‌ను కాలేయానికి అందించే కృత్రిమ క్లోమాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై ఉండే ఈ క్లోమం టైప్‌-1 మధుమేహ రోగుల్లో గ్లూకోజ్‌ స్థాయులను ఓ కంట కనిపెట్టి ఉంచుతుందట. దాదాపు 30 మంది రోగులకు కృత్రిమ క్లోమాన్ని అమర్చి 12 వారాలపాటు పరీక్షించగా సత్ఫలితాలు సాధించినట్లు హార్వర్డ్‌ జాన్‌ ఏ పౌల్సన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌ పరిశోధకులు తెలిపారు. అచ్చం సాధారణ వ్యక్తి క్లోమం ఏవిధంగా పనిచేస్తుందో కృత్రిమ క్లోమం కూడా అదే విధంగా పనిచేస్తుందని వెల్లడించారు. మరోవైపు, రక్తంలో ఉండే చక్కెరకు, కేన్సర్‌ వ్యాధికి మధ్య సంబంఽధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కేన్సర్‌ కణతులు చక్కెరను ఆహారంగా తీసుకొని మరింత తీవ్రంగా మారుతాయని తొమ్మిదేళ్ల సుదీర్ఘ అధ్యయనం తర్వాత బెల్జియం పరిశోధకులు గుర్తించారు.