మధుమేహానికి ఆలీవ్‌నూనె?

30-11-2017: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని పట్టి పీడిస్తున్న రుగ్మతల్లో మధుమేహానిదే ప్రథమ స్థానం. దీని వల్ల ఏటా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే నిర్మూలన పూర్తిగా సాధ్యం కాకపోయినా కొంతవరకూ అడ్డుకోవచ్చని అమెరికా యూనివర్శిటీ పరిశోధకులు అంటున్నారు. సౌందర్యసాధనంగా ఉపయోగించే ఆలీవ్‌ నూనెతో మధుమేహానికి అడ్డుకట్ట వేయవచ్చన్న విషయం వీరి అధ్యయనంలో వెల్లడైంది. ఈ నూనెలో ఉండే ‘ఒలెరోపిన్‌’ (oleuropein ) సమ్మేళనం శరీరంలో ఎక్కువ ఇన్సులిన్‌ విడుదలయ్యే చేసి మధుమేహాన్ని అడ్డుకుంటుంది. ఇప్పటికే చాలామంది ఆలివ్‌ ఆయిల్‌ని వంటల తయారీలో వినియోగిస్తున్నారు. దీని వాడకం పెరిగితే చాలావరకూ ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అయితే దీని మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని వీరు స్పష్టం చేస్తున్నారు.