డయాబెటీస్‌ స్త్రీలలోనే ఎక్కువ?

28-09-2017: ఇప్పటి వరకూ పురుషులే ఎక్కువగా డయాబెటీస్‌ బారిన పడుతుంటారన్న అపోహ చాలా మందిలో ఉంది. కానీ అది తప్పు అని ఇటీవలి నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది. పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలోనే డయాబెటీస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువని తాజా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. శరీరంలో ఐరన్‌ నిల్వలు పెరిగితే ప్రీరాడికల్స్‌ ఉత్పత్తి ఎక్కువై, ఇన్సులిన్‌ను దెబ్బతీస్తాయని ఫలితంగా టైపు 2 డయాబెటీస్‌ వచ్చే అవకాశం ఉందని అధ్యయనకారులు అంటున్నారు. ముఖ్యంగా స్త్రీలకు ఏమాత్రం నీరసం అనిపించినా ఐరెన్‌ మాత్రలు వేసుకుంటూంటారనీ, దీని వలన ఐరన్‌ నిల్వలు పెరిగి డయాబెటీస్‌ వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 28-09-2017: