ఆరోగ్య రేడు... నేరేడు

26-07-2017: నేరేడులో చాలా జాతులున్నా, మన ప్రాంతంలో నేరేడు, అల్ల నేరేడు ఈ రెండు జాతులే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రెంటిలోనూ ఔషధ గుణాలు సమానమే.
మధుమేహ రోగులు, నేరేడు గింజల పొడిని ప్రతి రోజూ తింటే క్లోమగ్రంథి చైతన్యమై, ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరిగి చక్కెర నిలువలు త గ్గుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడయ్యింది.
నేరేడు విత్తనాలు, పొడపత్రి కాచు, పసుపు, ఎండు ఉసిరిక కలిపి చూర్ణం చేసి, ఆ చూర్ణాన్ని ఒక చెంచా చొప్పున రోజుకు మూడు సార్లు సేవిస్తే దీర్ఘకాలిక మధుమేహం కూడా అదుపులోకి వస్తుంది.
నేరేడు చిగుళ్లు, మామిడి చిగుళ్లు తీసుకుని వాటితో కషాయం కాచి, దానిలో తేనె చేర్చి సేవిస్తే, పైత్యపు వాంతులు వెంటనే తగ్గుతాయి.
నేరేడు ఆకు చూర్ణంతో పండ్లు తోమితే కదిలే దంతాలు కూడా గట్టిపడతాయి.
నేరేడు చెక్క కషాయం పుక్కిలిపడితే నోటిలోని పుండ్లు చాలా త్వరగా మానిపోతాయి.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, నేరేడు పండ్లు తింటే అవి కరిగిపోవడమే కాకుండా, మరోసారి రాళ్లు ఏర్పడే అవకాశమే ఉండదు.
నేరేడు ఆకులను నీళ్లల్లో వేసి బాగా మరిగించి, కాలిన పుండ్ల మీద రోజుకు మూడు నాలుగు సార్లు పోస్తే చాలా వేగంగా అవి మానిపోతాయి. కాకపోతే ఎప్పటికప్పుడు ఆకులను మారుస్తూ ఉండాలి.