ఈ హార్మోన్‌తో ఇన్సులిన్‌ సూపర్‌

02-11-2017 టొరెంటో: ఆస్టియోకాల్సిన్‌.. ఇది ఓ ఎముక హార్మోన్‌. వ్యాయామం చేయడం వల్ల ఉత్పత్తయ్యే ఈ హార్మోన్‌ ప్రధానంగా ఎముకలను దృఢంగా ఉంచేందుకు దోహదపడుతుంది. అయితే.. మధుమేహాన్ని నియంత్రించడంలో, స్థూలకాయాన్ని తగ్గించడంలో, ఆకలి పుట్టించడంలో కూడా ఈ హార్మోన్‌ కీలకంగా పనిచేస్తుందని తాజాగా ఓ అధ్యయనం ద్వారా తేలింది. ముఖ్యంగా.. మధుమేహుల్లో ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా ఈ హార్మోన్‌ నియంత్రిస్తుందట.