మధుమేహ నియంత్రణకు...

01-06-2018: ప్రతి రోజూ పరగడుపున 5 గ్రాముల మెంతుల చూర్ణాన్ని, నీటితో తీసుకుంటే షుగర్‌ నిల్వలు నియంత్రణలో ఉంటాయి.

రెండు భాగాల మెంతుల చూర్ణానికి, ఒక భాగం త్రిఫలా చూర్ణం కలపాలి. ఈ మిశ్రమాన్ని 5 గ్రాముల మోతాదులో మాత్రలుగా చేసుకోవాలి. ఈ మాత్రలను ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు వేసుకుంటే షుగర్‌ నిల్వలు అదుపులోకి వస్తాయి.
పసుపు, ఉసిరికాయ చూర్ణాన్ని సమ పాళ్లల్లో తీసుకుని, 5 గ్రాముల మోతాదులో మాత్రలు తయారు చేసుకుని, ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తీసుకుంటే షుగర్‌ అదుపులోకి వస్తుంది.
ప్రతి రోజూ ఉదయం పరడుపున ఓ 10 లేత వేపాకు చిగుర్లను నమిలి తినేస్తే మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.
పొడపత్రి చూర్ణాన్ని 5 గ్రాముల మోతాదులో ఉదయం, సాయంత్రం అరగంట ముందు వేసుకుంటే మధుమేహ సమస్యను అడ్డుకోవచ్చు.
ప్రతి రోజూ పరగడుపున అర గ్లాసు కాకర కాయ రసం సేవిస్తే రక్తంలోకి చక్కెర అదుపులో ఉంటుంది. కాకపోతే, మొదటి రోజూ అరగ్లాసు అనికాకుండా, ఒక్కొక్క స్పూనుతో వారానికి ఒక్కో స్పూను చొప్పున పెంచుకుంటూ పోవాలి.
తిప్ప తీగె చూర్ణాన్ని 5 గ్రాముల మోతాదులో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు వేసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.